వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర సోమవారం 15.2 కిలోమీటర్లు సాగనుంది. ఆదివారం రాత్రి బస చేసిన జూలకల్ గ్రామ శివారు నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభమవుతుంది. జూలకల్, పొన్నకల్, గూడూరు, గుడిపాడు మీదుగా పెంచికలపాడు వరకు సాగుతుంది. గూడూరు మండల కేంద్రంలో బహిరంగసభ ఉంటుందని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. కాగా కోడుమూరు నియోజకవర్గంలోని సి.బెళగల్ మండలంలో ఆదివారం పాదయాత్ర సాగింది. సోమవారం గూడూరు మండలంలోకి షర్మిల ప్రవేశిస్తారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment