యువనాయకత్వాన్ని బలపర్చాలనే ఉద్దేశంతో తాను వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలని భావిస్తే తాము అభ్యం తరం చెప్పబోమని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించిందని, ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తానని పేర్కొందని, అందుకే పార్టీలో చేరుతున్నానని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను పోటీ చేయాల్సిందిగా పార్టీ చెబితే చేస్తానని, లేదు, సేవలందించమంటే అందిస్తానన్నారు. అంతకు ముందు కొండా సురేఖ మాట్లాడుతూ నర్సంపేటకు చెందిన రుద్రమ పదవులను ఆశించి పార్టీలో చేరలేదని, వైఎస్సార్ ఆశయాల సాధన కోసం ఆయన కుటుంబం పడుతున్న తపన చూసి వారితో కలసి పనిచేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆమె ముందుకు వచ్చారన్నారు.
source:sakshi
No comments:
Post a Comment