పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, పి.జనార్ధన రెడ్డి అని, అందుకే ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకున్నారని సీఎల్పీ మాజీ నేత పి.జనార్థన్ రెడ్డి కుమార్తె విజయా రెడ్డి అన్నారు. వాళ్లు చేసిన సేవా కార్యక్రమాల్ని ప్రజలెప్పుడూ మర్చిపోరని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆమె పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు నడిచిన బాటలో మనం అందరం కూడా ప్రజాసేవ చేద్దామని పిలుపు ఇచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో, జగనన్న నాయకత్వంలో ప్రజాసేవ చేయాలని పార్టీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు.
విజయమ్మ పార్టీ కండువా కప్పి విజయా రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. దరఖాస్తు ఫారం నింపి విజయా రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, రోజా, వాసిరెడ్డి పద్మ, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మలా కుమారి తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి భారీ ర్యాలీగా జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ ర్యాలీలో పిజెఆర్ అభిమానులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖైరతాబాద్‌లో పీజేఆర్ విగ్రహానికి, పంజాగుట్టలో మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాలు వేసి నివాళులర్పించారు

No comments:
Post a Comment